కేంద్రం తక్షణమే రూ.2వేల కోట్లు కేటాయించాలి : సీఎం రేవంత్

భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సూర్యాపేటకు వచ్చిన సీఎం, మోతె మండలం రాఘవపురంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలు అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం వెంటనే రూ.2 వేల కోట్లు రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. జిల్లాలో 30 సెం.మీ అతి భారీ వర్షం పడినట్లు వెల్లడిరచారు. తక్షణ సాయం కోసం సూర్యాపేట కలెక్టర్‌కు రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో 5 వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాం. వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఖమ్మం, నల్గొండ పరిస్థితిని ప్రధాని మోదీ, హో మంత్రి అమిత్ షాకు వివరించాం. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధానిని ఆహ్వానించాం. కేంద్రం తక్షణమే తెలంగాణకు రూ.2 వేల కోట్లు కేటాయించాలి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలి అని అన్నారు.