వారిపై కఠిన చర్యలు : సీఎం రేవంత్ హెచ్చరిక

హైడ్రా పేరు చెప్పి కొందరు అవినీతికి పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకొని డబ్బులు అడుగుతున్నట్లు తెలిసిందన్నారు. అమాయకులను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారని, కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులపై కూడా ఫిర్యాదులు వచ్చాయని సీఎం చెప్పారు. అక్రమంగా డబ్బు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు.