సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించి తిరిగి రాష్ట్రానికి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. విదేశాలకు వెళ్లి వచ్చిన సీఎం రేవంత్‌కు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్యల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి స్వాతం పలికారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రేవంత్ అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌లో వెళ్లారు.