Revanth Reddy: ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..
ప్రజలను పట్టి పీడించిన ఆ నాటి ప్రభుత్వాన్ని ఓడించి అండగా నిలబడి ప్రజా పాలన తీసుకువచ్చారు.. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు.. ముగిశాక అభివ్రుద్ది, సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందించడమే లక్ష్యం.. సంక్షేమం, అభివ్రుద్ది ని రెండు కళ్ల లా భావించి నాలుగు కోట్ల ప్రజలు అభ్యున్నతే లక్ష్యం గా పనిచేస్తున్నాం.. రెందేళ్లలో ఏ ఓక్క రోజు కూడా నేను సెలవు తీసుకోలేదు.. జడ్పీటీసీ గా, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే , ఎంపిగా, ముఖ్యమంత్రి గా చిన్న వయసులోనే నాకు అవకాశం వచ్చింది.. ప్రజల గౌరవ మర్యాదలు పొందడం కోసం నిరంతరం పనిచేస్తున్న..
తెలంగాణ ప్రజల ఆశ్వీరాధం, దేవుడి సంకల్పం వల్లనే ముఖ్యమంత్రి అయ్యాను.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండేళ్ల పాలన సాగించాను.. ఎంఎల్ ఏ పాయల్ శంకర్, ఎంపీ గోడెం నగేష్ బీజేపీ అయినప్పటికి వారిని కలుపుకుని అభివ్రుద్ది పథం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్న.. పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పడు ప్రతిపక్ష నాయకులను ముఖ్యమంత్రి సభలో పాల్గొనే అవకాశం ఇవ్వలేదు.. మాట్లాడనివ్వలేదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ కు వెళ్తే వందలాది మందిపోలీసులను పెట్టి నన్ను, సీతక్కను నిర్భదించారు.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు.. రానివ్వం..
ఢిల్లీలో ప్రధాని, కేంద్ర మంత్రులును కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రమ్మని ఆహ్వానించాను.. సోనియమ్మ వల్లనే తెలంగాణ సాకారం అయింది.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లాంటి గొప్ప కార్యక్రమం పెట్టుకున్నప్పుడు కన్నతల్లి లాంటి సోనియమ్మ ఆశ్వీరాధం తీసుకున్నాం.. ఖర్గే, రాహుల్, ప్రియాంక ను కలిసి రాష్ట్రానికి రావాలని ఆహ్వానించాం.. సంక్షేమం, అభివ్రుద్ది ని ముందుకు తీసుకెళ్లాంటే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలి.. ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు కట్టాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ నన్ను కలిసి కోరారు.. ఎయిరో పోర్టు కోసం భూమి ఇస్తే కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు సహకరిస్తామని చెప్పారు..
ప్రధాని మోదీ ఎయిర్ పోర్టుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.. యేడాదిలో ఆదిలాబాద్ కు ఎయిర్ పోర్టు తీసుకువస్తా.. ఎయిర్ బస్సు ను కూడా ఆదిలాబాద్ కు తీసుకువస్తా.. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక మొదటి పర్యటన నిర్మల్ కు వచ్చాను..దళిత , గిరిజన దండోరా ఇంద్రవెల్లిలో నిర్వహించాను.. ప్రభుత్వంలోకి వచ్చాక మొదటి సంతకంతో ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించాం… ఆ నాటి అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివ్రుద్ది చేసే బాధ్యత నేను తీసుకుంటా.. వచ్చే రెండు నెలలో ఇక్కడికి వచ్చి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి సమస్యలకు పరిష్కారం చేస్తా.. నిధులు ఇస్తా
ప్రాణహిత, చేవేళ్ల తో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16 లక్షల ఎకరాల కు నీళ్లు ఇవ్వడం కోసం 38 వేల కోట్లతో శంకుస్థాపన చేశారు.. ఆదిలాబాద్ కు నీళ్లు ఇవ్వడం కోసం వందల కోట్లు ఖర్చు చేశారు.. ఒక పెద్దాయన దయ్యంలా మారి ప్రాజెక్టను కాలగర్భంలో కలిపాడు.. పేరు, ఊరు , అంచనాలు మార్చాడు.. అంచనాలు 1.50 లక్షల కోట్లు అయ్యాయి.. కాళేశ్వరం మూడేళ్ల లో కూలేశ్వరం అయింది. ఆయన ఇంట్లో కనుక వర్షం కురిసింది తప్ప ఆదిలాబాద్ కు నీళ్లు రాలేదు.. తమ్మిడి హట్టి దగ్గర 150 మీటర్ల కు అనుమతి ఇవ్వడానికి మహారాష్ట్ర ఒప్పుకున్నా గత ప్రభుత్వ తీరు వల్ల కిందకు ప్రాజెక్టు తరిలిపోయింది.. లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకపోయాయి.. సొమ్ము వచ్చి సొంత కుటుంబ సభ్యులే కత్తులతో పొడ్చుకుంటున్నారు.. బిడ్డ, కొడుకు, అల్లుడు ఒ దిక్కు.. అసలు ఆయన ఎక్కడ పడుకున్నడో అందరికి తెలుసు.. పైసల పంచాయతీ తప్ప వాళ్ల ఇంట్లో ఇంకో పంచాయతీ లేదు.. 150 మీటర్ల దగ్గర తుమ్మిహట్టి దగ్గర ప్రాణహిత దగ్గర ప్రాజెక్టు కట్టడానికి టెండర్లు పిలిచాం..
ఆదిలాబాద్ జిల్లా పొలాలకు నీళ్లు ఇస్తాం.. ప్రాజెక్టు శంకుస్థాపన కు నేను వస్తా.. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది..ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపి నగేష్ తన పరపతితో ఒప్పించాలి.. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కంపెనీ మూతపడింది.. ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకువచ్చి ఫ్యాకర్టీని తెరిపించడానికి ప్రయత్నం చేస్తాం.. ఆదిలాబాద్ లో ఎడ్యూకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ ను అభివ్రుద్ది చేస్తా.. ఆదిలాబాద్ కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే.. ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా మనసుకు అనిపిస్తుంది.. ఇంద్రవెల్లి లేదా కొమ్రం భీం పేరు పెట్టుకుంటే బాగుంటుంది…ఇది కేవలం నా సూచన మాత్రమే..
10 ఏళ్ల లో నిరుద్యోగుల కు నియామకాలు రాలేదు కానీ వాళ్ల ఇంట్లో మాత్రమే వచ్చాయి.. మొదటి యేడాదిలోనే 61 వేల మంది కి నియామక పత్రాలు ఇచ్చాం.. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్ వన్, గ్రూప్ టు ఉద్యోగాలు ఇచ్చాం.. 562 మంది గ్రూప్ వన్ అధికారులను తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేశాం.. తలలు లెక్క బెట్టి ఎల్బీ స్టేడియంలో 61 వేల మంది ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర దేశంలోనే మొదటిది.. త్వరలో మరో వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం.. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి..
తెలంగాణ యువకులు ఐఎఎస్, ఐపిఎస్ లు కావాలన్నదే నా కోరిక.. తెలంగాణ ఆడబిడ్డలను గత ముఖ్యమంత్రి దివాళా తీయించాడు.. 8100 కోట్ల రూపాయలను ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం కోసం కేటాయించాం.. 1000 బస్సులకు ఆడబిడ్డలను యజమానులను చేశాం.. స్వయం సయహాక మహిళలు పెట్రోల్ బంకులు నడుపుతున్నారు.. 65 లక్షల మంది స్వయం సయహాక మహిళలకు ఇందిరమ్మ చీరలను పంచాం.. కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంచుతాం.. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం.. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే పాడి పంటలు సంవ్రుద్దిగా పడుతాయి.. అందుకే రాష్ట్రంలో వర్షాలు సంవ్రుద్ది గా పాడి పంటలు బాగా పండాయి. వరి వేసుకుంటే ఉరే నని గత ముఖ్యమంత్రి చెప్పారు.. మేం మాత్రం సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని మేం చెప్పాం..
మూడు కోట్ల పది లక్షల మంది సన్న బియ్యం తో బువ్వ తింటున్నారు.. కొరాట, చెనాక ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం.. నోరు మంచిగా ఉండే వారిని సర్పంచ్ లు గా గెలిపించుకోవాలి.. ఎన్నికల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టొద్దు.. వీలైతే ఏగగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకోవాలి.. నిధులు తీసుకురాగలిగే వారిని సర్పంచ్ లుగా గెలిపించుకోవాలి.. నిధులిచ్చి అభివ్రద్ది చేసే బాధ్యత నాది..






