Revanth Reddy: కేంద్రం ఎవరివైపూ మాట్లాడలేదు : సీఎం రేవంత్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల అంశంలో ఉన్న సమస్యలపై చర్చించడానికి అధికారులు, ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఆ కమిటీ నివేదిక మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తిశాఖ నిర్వహించిన సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఈ భేటీలో ఏపీ ప్రభుత్వం నుంచి గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) కడతామన్న ప్రతిపాదనకు చర్చకు రాలేదని తెలిపారు. అజెండాలో వారు కడతామనే ప్రతిపాదనే చర్చకు రానప్పుడు ఆపాలన్న చర్చే ఉండదన్నారు. ఇది అపెక్స్ కమిటీ భేటీ కాదని చెప్పారు. తెలంగాణ హక్కులను కేసీఆర్ గతంలో ఏపీకి ధారాదత్తం చేశారు. ఆయన చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. పెండిరగ్ సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం కేవలం నిర్వాహక పాత్రే పోషించింది. కేంద్రం ఎవరివైపూ మాట్లాడలేదు అని అన్నారు.