Davos : మేం సాధించిన విజయాల్లో దావోస్.. అతి పెద్దది : సీఎం రేవంత్

తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్(Davos) ఒప్పందాల సాధన అతి పెద్దదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దావోస్ సదస్సు ద్వారా దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు తెలిపారు. హైదరాబాద్ (Hyderabad)లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంపై కొందరు చేసిన దుష్ప్రచారం పటాపంచలు అయ్యింది. ప్రభుత్వంపై, రాష్ట్రంపై నమ్మకం ఉంచుతూ భారీ పెట్టుబడులకు చాలామంది ముందుకు వచ్చారు. ఈ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచుతూ అంతర్జాతీయ సంస్థలు(International organizations) భారీ పెట్టుబడులు పెడుతున్నాయి అని తెలిపారు.