Revanth Reddy : రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నేతలంతా కలిసి రావాలి : రేవంత్‌రెడ్డి

దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీయే దుర్వినియోగం చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy )విమర్శించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థలను ఎన్డీయే అపహాస్యం చేస్తోంది. రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్న కూటమి ఒక వైపు, రాజ్యాంగాన్నే రద్దు చేయాలని చూస్తున్న కూటమి మరో వైపు. పీవీ నరసింహారావు తర్వాత తెలుగువాడిని కీలక పదవిలో కూర్చోబెట్టే అవకాశం మనకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఏకతాటి మీదకు రావాలి. టీడీపీ, వైసీపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం సహా అన్ని పార్టీలు ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి (Justice Sudarshan Reddy ) కి మద్దతు తెలపాలి. చంద్రబాబు(Chandrababu), కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నేతలంతా కలిసి రావాలి. అనాడు ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao ) కు ఎన్టీఆర్ (NTR) మద్దతు ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పీవీపై పోటీ పెట్టకుండా గెలిపించారు. తెలుగువాడు అత్యున్నత స్థానంలో ఉండాలనే భావనతో సహకరించారు. ఇప్పుడు మరోసారి తెలుగు నేతలంతా ఎన్టీఆర్ స్ఫూర్తితో సహకరించాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి వెనుకబడిన రైతు కుటుంబం నుంచి వచ్చారు. న్యాయమూర్తిగా, లోకాయుక్తగా దేశానికి సేవలదించారు అని అన్నారు.