Revanth Reddy : ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాలి : సీఎం రేవంత్ ఆదేశం

తెలంగాణలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అప్రమత్తం చేశారు. ఢల్లీి పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడి నుంచే సీఎంవో (CMO) అధికారులతో మాట్లాడారు. అన్ని జిల్లా కలెక్టర్లు (District Collectors), వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి. నీటి ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజల (Peoples )ను అప్రమత్తం చేయాలి. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రజలకు సాయం చేసేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలి అని రేవంత్ ఆదేశించారు.