Revanth Reddy: ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం : సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ఢల్లీిలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ (KCR) అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని, వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు (Tummidihatti Project) కోసం మహారాష్ట్ర (Maharashtra) లో పర్యటిస్తానని తెలిపారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చితీరుతామన్నారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ (KCR Kit) తప్ప పాత పథకాలన్నీ అమల్లోనే ఉన్నాయని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాయడం కాదని, ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.