Revanth Reddy : కులగణన, ఎస్సీ వర్గీకరణలో తెలంగాణ ఒక రోల్ మోడల్ : రేవంత్ రెడ్డి

తెలంగాణలో కులగణన దేశానికి రోడ్ మ్యాప్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఢల్లీి పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తో సమావేశమైన రేవంత్‌రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కులగణన ద్వారా ప్రజాసంక్షేమానికి బాటలు వేస్తున్నాం. కులగణన, ఎస్సీ వర్గీకరణలో తెలంగాణ ఒక రోల్ మోడల్. రాహుల్ గాంధీ చెప్పింది నేను కచ్చితంగా చేస్తాం. రాష్ట్రంలో కులగణన సమగ్రంగా నిర్వహించాం. ఇందులో వెల్లడైన వివరాల ఆధారంగా భవిష్యత్తులో కమిషన్ గాని కమిటీ గాని వేసి ప్రజలకు ఏ విధంగా సంక్షేమ ఫలాలు చేరువ చేయాలనే దానిపై కసరత్తు చేస్తామన్నారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటాం. ప్రధాని మోదీ (Modi) ని వ్యక్తిగతంగా నేను తిట్టలేదు. మోదీ పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పారు. పుట్టకతో బీసీ కాదు కాబట్టే బీసీల పట్ల ఆయనకు చిత్తశుద్ది లేదని అన్నారు. నా వ్యాఖ్యలను కిషన్ రెడ్డి(Kishan Reddy) , బండి సంజయ్ (Bandi Sanjay) వక్రీకరించారు. మోదీకి చిత్తశుద్ది ఉంటే జనగణనలో కులగణన కూడా చేయాలి. మంత్రివర్గ విస్తరణపై రాహుల్ గాంధీతో చర్చించలేదు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తాం అని అన్నారు.