Revanth Reddy : కాంగ్రెస్‌లోకి ఆ కుటుంబానికి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్ రెడ్డి

తాను ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోకి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి (KCR family) ఎంట్రీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఢల్లీిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ఆ కుటుంబమే ప్రధాన శత్రువని మండిపడ్డారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై ఢల్లీిలో ఎలాంటి చర్చ జరగలేదని సీఎం చెప్పారు. హైదరాబాద్ (Hyderabad) వచ్చాక అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామని తెలిపారు. కర్ణాటక కులగణనపై మాత్రమే అధిష్ఠానం వద్ద చర్చలు జరిగాయన్నారు. కాళేశ్వరం (Karnataka) పై రెండు రోజుల్లో మీడియా సమావేశం నిర్వహిస్తానని వెల్లడిరచారు. కాళేశ్వరం డాక్యుమెంట్లు (Kaleshwaram Documents) అన్నింటినీ బయటపెడతానన్నారు. తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అన్నింటికీ అడ్డుపడుతోంది కిషన్‌రెడ్డేనని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టుకూ ఆయన నిధులు సాధించలేదని విమర్శించారు.