CM Ramesh: తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ : సీఎం రమేశ్

తెలంగాణ మాజీ కేటీఆర్ (KTR) తనపై చేసిన ఆరోపణలను అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ (CM Ramesh) ఖండించారు. అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో తనకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రూ.1660 కోట్ల నామినేషన్ వర్క్ ఇచ్చారని అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిపై బురద జల్లాలని నాపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కవిత (Kavitha) జైల్లో ఉన్నప్పుడు ఢల్లీిలో నా ఇంటికి వచ్చి కలిసిన విషయం కేటీఆర్ మర్చిపోయారా? రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ (TDP) కలిసి పోటీ చేస్తాయన్న భయంతో కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నాపై చేసిన తప్పుడు ఆరోపలపై బహిరంగ చర్చకు సిద్దం అని అన్నారు.