Jubilee Hills:జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై నివేదిక ఇవ్వాలి: రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి (Congress candidate) ఎంపికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమీక్షించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ముగ్గురు మంత్రుల (Ministers) కు ఆయన సూచించారు. తాజా రాజకీయ పరిస్థితులను వివరిస్తూ, నివేదికలో అభ్యర్థుల పేర్లు, వివరాలు ఉండాలని పేర్కొన్నారు. గెలుపు గుర్రాన్ని జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో నిలబెట్టాలన్న కోణంలోనే నివేదిక ఉండాలని సీఎం (CM) పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికశాతం స్థానాలకు కైవసం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఇన్‌ఛార్జ్ మంత్రులతో పాటు ఎంపీల భాగస్వామ్యంతో వెళ్లాలని సూచించారు.