Genome Valley: జీనోమ్ వ్యాలీతో తెలంగాణకే గుర్తింపు : సీఎం రేవంత్ రెడ్డి

శామీర్‌పేట జీనోమ్‌వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ (Icor Biologics) పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జీనోమ్ వ్యాలీ (Genome Valley)లోని పరిశ్రమలు తెలంగాణకే గుర్తింపును తీసుకొచ్చాయి. దేశంలోని వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 33 శాతం కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నాం. ప్రపంచాన్ని కోవిడ్ భయపెడుతున్న సమయంలో ఇక్కడి నుంచే వ్యాక్సిన్లు తయారు చేశాం. ప్రపంచ దేశాలకు సరఫరా చేయగలిగాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు(Sridhar Babu), వివేక్(Vivek), ఉన్నతాధికారులు పాల్గొన్నారు.