శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు.. ఘన స్వాగతం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. పలువురు టీడీపీ నాయకులు,కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం, పార్టీ వ్యవహారాలతో బిజగా గడిపిన చంద్రబాబు, విశ్రాంతి కోసం ఈ నెల 19న విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.