DK Aruna: ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు

ఎంపీ డీకే అరుణ (DK Aruna)కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఎఫ్‌సీఐ కన్సల్టేటివ్ కమిటీ (FCI Consultative Committee) తెలంగాణ చైర్‌పర్సన్ (Telangana Chairperson) గా డీకే అరుణను నియమించింది. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో రాష్ట్రంలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో సమస్యపై అధ్యయనం చేయనుంది. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికి (Central Government) డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు.