High Court: హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట

తెలంగాణ హైకోర్టు (High Court)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి ఊరట లభించింది. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ (Gachibowli Police Station) లో ఆయనపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని గతంలో పెద్దిరాజు (Peddiraja ) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 2016లో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని 2020లో రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 20న ఇరువైపులా వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. ఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని దర్యాప్తులో తేలిందని న్యాయస్థానం తెలిపింది. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణల్లో సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది.