Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Kaushik Reddy ) పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) పై కౌశిక్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాజేంద్రనగర్ (Rajendranagar ) కు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. నిన్న సీఎంపై కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.