WTF: డబ్ల్యుటీఎఫ్ బిజినెస్ సెమినార్

ప్రపంచ తెలుగు సమాఖ్య (WTF) 12వ ద్వైవార్షిక మహాసభల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తు న్నారు. అలాగే బిజినెస్ సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. 3వ తేదీ మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 వరకు బిజినెస్ సెమినార్ ను ఏర్పాటు చేశారు. తెలుగు ట్రయల్‌బ్లేజర్స్ ఆఫ్ ఇన్నోవేషన్ ` బిల్డింగ్ ప్యూచర్ రెడీ ఇండస్ట్రీస్ అండ్ సొల్యూషన్స్ అంశంపై కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బయోటెక్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్ ఇతర రంగాల్లో రాణించిన ప్రముఖుల విజనరీని ఇందులో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజినెస్ ప్రముఖులు పాల్గొంటున్నారు.
ప్యానలిస్ట్‌లో భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డా. కృష్ణ ఎల్లా, డాక్టర్ రెడ్డీస్ కంపెనీ మేనెజింగ్ డైరెక్టర్, కో చైర్మన్ జి.వి. ప్రసాద్, ఎల్. వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్, చైర్ డాక్టర్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమ చిగురుపాటి, స్కైరూట్ ఏరో స్పేస్ కో ఫౌండర్, సిఇఓ పవన్ కుమార్ చందన, ఐస్ప్రూట్ సిఇఓ, ఫౌండర్ సుందరి పాటిబండ్ల ఉన్నారు. మోడరేటర్‌గా మాలక్ష్మీ గ్రూపు ఛీప్ మెంటర్, ఫౌండర్ హరిశ్చంద్రప్రసాద్ వ్యవహరిస్తారు.
సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు మరో బిజినెస్ సెషన్ ఏర్పాటు చేశారు. డ్రైవింగ్ స్కేల్ ` ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ లీడర్ షిప్ అండ్ గ్రోత్ అనే అంశంపై ఈ సెమినార్ జరుగుతుంది.
ప్యానెలిస్ట్‌లలో దివిస్ లేబొరేటరీ ఎండి, ఫౌండర్ డాక్టర్ మురళీ కృష్ణ ప్రసాద్ దివి, సియంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఫౌండర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి, దొడ్ల డైరీ లిమిటెడ్ మేనెజింగ్ డైరెక్టర్ సునీల్ రెడ్డి దొడ్ల, క్వాంటెలా, ఫౌండర్ పాత్ సెట్టర్ ఎఐ చైర్మన్ శ్రీధర్ గాంధీ, ద్వారిన్ బాక్స్ కో ఫౌండర్ రోహిత్ చెన్నమనేని, ర్యాపిడో ఫౌండర్ రిషికేష్ ఎస్‌ఆర్ ఉన్నారు. ఎండియా పార్టనర్స్ మేనెజింగ్ డైరెక్టర్ సతీష్ ఆంధ్ర మోడరేటర్‌గా వ్యవహరించనున్నారు.