KTR: జీసీసీ హబ్‌గా భారత్ ..ఐసీఏఐ సమ్మిట్‌లో కేటీఆర్

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు భారతదేశం హబ్‌గా మారిందని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. వీటి ఏర్పాటులో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ (Hyderabad) త్వరలోనే మొదటి స్థానానికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ ఎకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మాదాపూర్‌లో హెచ్‌ఐసీసీ (HICC) లో నిర్వహించిన 3వ జీసీసీ సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా కేటీఆర్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. పెట్టుబడుల ను ఆకర్షించేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్ ఐపాస్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఫలితంగా బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ, హెల్త్‌కేర్ ఇలా వేర్వేరు రంగాల్లో భారీగా పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించగలిగామన్నారు. బీసీసీలు వ్యూహాత్మక, ఆవిష్కరణల కేంద్రాలుగా మారుతున్న క్రమంలో భారతదేశంలో సీఏల సేవలు కీలకమన్నారు.