బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్?

కొణతం దిలీప్ ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అభియోగాలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం.
ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఘటనపై సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారని ఫిర్యాదులు రావడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా ఆయన పనిచేశారు. సీసీఎస్ కు దిలీప్ ను పోలీసులు తీసుకెళ్లారనే విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు నాయకులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
– శ్యామ్ సుందర్ రావు జాలిగామ, భూ విజన్