Vinod Kumar: ఇలాంటి విషయాల్లో తమ పార్టీ మొదటిది కాదు… చివరిది కాదు

రాజకీయాల్లో ప్రకంపనలు సహజమని, చాలా పార్టీలో ఇలాంటి ప్రకంపనలు చూశామని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ (BRS) నేత వినోద్ కుమార్ (Vinod Kumar) అన్నారు. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇలాంటి విషయాల్లో తమ పార్టీ మొదటిది కాదు, చివరిది కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ (BJP)తో పనిచేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునేవాళ్లమన్నారు. కవితలో ఇంత ఆవేదన ఉందని ఇవాళే తెలిసిందని, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని తెలిపారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు.