మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి… కాంగ్రెస్‌లో

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కలిశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చని అంశంపై ఫిర్యాదు చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఇతర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తుంగలో తొక్కుతోందో ఆయనకు వివరించాం. హామీలు అమలు చేయాలన్న విద్యార్థుల అరెస్టులు, అక్రమ కేసులతో భయానక వాతావారణం సృష్టిస్తున్నారు. గవర్నర్ చాలా సీరియస్‌గా ఈ అంశాలపై స్పందించారు. హోంశాఖ కార్యదర్శిని పిలిపి వివరాలు అడుగుతానని చెప్పారు. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేరుకున్న సంగతి గురించి గవర్నర్‌కు తెలిపాం. దీనిపై న్యాయపోరాం చేస్తున్నామని, స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలను కూడా గవర్నర్‌కు వివరించాం అని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, వారికి కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే వరకూ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.