మంత్రి కేటీఆర్ తో బోయింగ్ బృందం భేటీ
అమెరికాకు చెందిన ప్రసిద్ధ వైమానిక సంస్థ అయిన బోయింగ్ ప్రతినిధి బృందం ప్రగతిభవన్‌లో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. తెలంగాణ పెట్టుబడులకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ బోయింగ్ ప్రతినిధి బృందాన్ని కోరారు. బోయింగ్ సంస్థ నూతన అధ్యక్షుడు బ్రెండన్ నెల్సన్, పదవీ విరమణ పొందిన పాత అధ్యక్షుడు మైఖేల్ ఆర్థర్, ఇతర ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్రలో పెట్టుబడుల కోసం తమకు అన్నివిధాలా సహకరించారంటూ పాత అధ్యక్షుడు మైఖేల్‌ను మంత్రి అభినందించారు. కొత్త అధ్యక్షుడు బ్రెండన్ నెల్సన్‌కు మంత్రి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వైమానికి విభాగం సంచాలకుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.






