హైదరాబాద్‌లో బ్లాక్ బెర్రీ ఐవోటీ సెంటర్

కెనడాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ బ్లాక్‌బెర్రీ లిమిటెడ్ హైదరాబాద్‌లో నూతన ఐవోటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించింది. పూర్తిస్థాయిలో ఈ సెంటర్ అందుబాటులోకి వచ్చిందని, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఆసియా పసిఫిక్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ సెంటర్‌ను నెలకొల్పినట్లు,ముఖ్యంగా బ్లాక్‌బెర్రీ క్యూఎన్‌ఎక్స్ గ్లోబల్ డెవలపర్ నెట్‌వర్క్‌గా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించింది. కెనడా తర్వాత సంస్థకు ఉన్న రెండో అతిపెద్ద ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈవో) ఇదే కావడం విశేషం.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సీనియర్ మేనేజ్‌మెంట్, టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్ ఇంజినీరింగ్, క్లౌడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇంటిగ్రేషన్, సర్వీసు డెలివరీ విభాగాల్లో ప్రతిభ ఉన్నవారిని రిక్రూట్ చేసుకుంటున్నది సంస్థ. భారత్‌లో వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఐవోటీ సీఈవోని ప్రారంభించినట్లు, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ సొల్యుషన్స్ అండ్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా ఈ సెంటర్ పనిచేయనున్నదని తెలిపింది.