BJP: హైదరాబాద్ మేయర్ పీఠంపై బీజేపి సెన్సేషనల్ స్టెప్…?

తెలంగాణ(Telangana)లో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP).. ఇప్పుడు ఉన్న అన్ని అవకాశాలను వాడుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఈ నేపద్యంలోనే తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఎక్కువగానే ఫోకస్ పెట్టారు బిజెపి అగ్ర నేతలు. హైదరాబాద్ పీఠంపై కూర్చుంటే తర్వాత తెలంగాణపై దృష్టి పెట్టొచ్చని కమలం పార్టీ ఆలోచిస్తోంది.
ఈ నేపథ్యంలో వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓ సిని ప్రముఖుడికి హైదరాబాద్ మేయర్ సీటు ఆఫర్ చేయాలని బిజెపి ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉండే సదరు సినీ స్టార్ ను బిజెపిలోకి తీసుకొని ఆయనకు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి ఆఫర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆర్థికంగా కూడా బలంగా ఉన్న సదరు ప్రముఖుడు.. రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇక దాంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు సైలెంట్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యేకి కూడా ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.
ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైపు కూడా బీజేపీ అధిష్టానం దృష్టి సారిస్తోంది. తెలుగుదేశం పార్టీలో క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకత్వాన్ని తమ వైపుకు తిప్పుకునేందుకు బిజెపి అగ్ర నేతల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉంది. అటు నిజామాబాద్ జిల్లాలో కూడా ఆ పార్టీకి కొంత బలం ఉన్నా.. బిజెపి బలపడింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలను పక్కనపెట్టి మిగిలిన జిల్లాలపై ఫోకస్ పెట్టాలని బిజెపి భావిస్తుంది. ఇక త్వరలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మార్పు కూడా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జిల్లా కమిటీలను కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఇక టిడిపి, జనసేన కూడా త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది.