Ramachandra Rao: ఆయనకు గోబెల్స్ ఫ్రైజ్ ఇవ్వాలి : రామచంద్రరావు

ప్రధాని మోదీ బీసీ కాదంటూ బీసీ సమాజాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అవమానించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు (Ramachandra Rao) అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఏంటని తాము అడిగితే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కన్వర్టెడ్ బీసీ అనే కొత్త పదాన్ని రేవంత్‌రెడ్డి తీసుకొచ్చారని, ఆయనకు గోబెల్స్ ప్రైజ్ (Goebbels Prize) ఇవ్వాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ కమిటీలో 20 పోస్టులే ఉన్నాయని అన్నారు. 8 ఉపాధ్యక్షులు, 3 ప్రధాన కార్యదర్శులు, 7 కార్యదర్శులు, ఒక కోశాధికారి పోస్టు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ (Congress) కుటుంబ పార్టీ అయినందున జంబో కమిటీ ఉంటుందన్నారు. గత ఐదేళ్లుగా తనకు పార్టీ పదవి లేదని, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని అయ్యానన్నారు. నాయకులు గ్రామాల్లోకి వెళ్లి పనిచేయాలని సూచించారు.