BJP: బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి బీఫాం అందజేసిన రాంచందర్‌రావు

జుబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి ( Deepak Reddy) కి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు (N. Ramachandra Rao) బీఫాం అందజేశారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఖాయమని అన్నారు. దోచుకునే పార్టీలకు జుబ్లీహిల్స్ ఓటర్లు గుణపాఠం చెప్పనున్నారని స్పష్టం చేశారు. 21న దీపక్‌రెడ్డి నామినేషన్ (Nomination) దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.