రెండు కొత్త ఫ్రాంచైసీ స్టోర్‌లతో బిర్లా ఓపస్ హైదరాబాద్‌లో తన సేవలను విస్తరించింది

ఆదిత్య బిర్లా గ్రూప్ ఫిబ్రవరి 2024లో ‘బిర్లా ఓపస్’ని విడుదల చేస్తూ కీలక మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. వినియోగదారులతో అసమానమైన ఎంగేజ్‌మెంట్ మరియు అసాధారణ బ్రాండ్ అనుభవాలతో పెయింట్ పరిశ్రమను పునర్నిర్వచించింది. బిర్లా ఓపస్ 2,300+ లేతరంగు రంగు ఎంపికలతో నీటి ఆధారిత పెయింట్‌లు, ఎనామెల్స్, వుడ్ ఫినిషింగ్‌లు, వాల్‌పేపర్‌లతో సహా 145 ఉత్పత్తులను, 1,200 ఎస్‌కేయూ (SKU)లను అందిస్తూ భారతదేశంలోని ప్రముఖ పెయింట్ బ్రాండ్‌లలో ఒకటిగా నిలవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తమ ఫ్రాంచైజ్ స్టోర్‌లలోకి అడుగు పెట్టమని, ప్రతి బ్రష్‌స్ట్రోక్ కథ చెప్పే ప్రపంచాన్ని కనుగొనమని బిర్లా ఓపస్ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. రంగు ఎంపిక, అత్యుత్తమ-నాణ్యత ఉత్పత్తులు, వినూత్న పరిష్కారాలపై నిపుణుల మార్గదర్శకత్వాన్ని ఈ స్టోర్లలో పొందవచ్చు.
జులై 11 మరియు 12, 2024న, బిర్లా ఓపస్ హైదరాబాద్‌లో తమ రెండు ఫ్రాంఛైసీ స్టోర్‌లను ప్రారంభించి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రాలు బిర్లా ఓపస్ అన్ని ఉత్పత్తులకు ఒన్-స్టాప్ షాప్‌గా పనిచేస్తాయి. ఈ ప్రాంతపు గొప్ప వారసత్వాన్ని, సాంస్కృతిక సారాన్ని ప్రతిబింబిస్తూ, వేడుక జరుపుకునే విభిన్న షేడ్స్‌ను ప్రదర్శిస్తాయి. ఈ స్టోర్‌లు స్థానిక సముదాయపు శక్తితో సంపూర్ణంగా కలిసిపోయేలా శక్తివంతమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయి. వినియోగదారుని సంతృప్తికి ప్రాధాన్యతనిస్తూ, ఈ స్టోర్‌లు బిర్లా ఓపస్ ఉత్పత్తులు, సేవల సమగ్ర ఎంపికను అందిస్తాయి. వివిధ టెక్చ్సర్‌లను వినియోగదారులు ఆస్వాదించేందుకు, షేడ్ డెక్‌లను బ్రౌజ్ చేయడానికి, వారికి ఇష్టమైన రంగులను, ఉత్పత్తులను ఎంచుకోవడానికి నిపుణులను సంప్రదించడానికి వీలు కల్పిస్తుంది.
బిర్లా ఓపస్ సీఈఓ రక్షిత్ హర్‌గేవ్ మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్‌లో మా కొత్త ఫ్రాంచైసీ స్టోర్‌ల ప్రారంభోత్సవం ఈ ప్రాంతంలో బిర్లా ఓపస్ ప్రయాణంలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. ఈ విస్తరణ మా వృద్ధిని సూచించడమే కాకుండా అసమానమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలన్న మా నిబద్ధతను బలపరుస్తుంది. భారతదేశం వ్యాప్తంగా, మా వినియోగదారులకు నాణ్యతను, ఆవిష్కరణలను అందించే క్రమంలో హైదరాబాద్‌లోని శక్తివంతమైన సముదాయం మా ఆఫర్‌లను ఎలా స్వీకరిస్తాయో వేచి చూసేందుకు మేము సంతోషిస్తున్నాము’’ అని తెలిపారు.
ఫ్రాంచైజ్ స్టోర్ బిర్లా ఓపస్ సన్ సిటీ యజమాని భరత్ చౌదరి మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్‌లోని మా కొత్త స్టోర్‌తో బిర్లా ఓపస్ కుటుంబంలో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. నగరానికి ఉన్న డైనమిక్ ఎనర్జీ, అభివృద్ధి చెందుతున్న డిజైన్ దృశ్యం మా పెయింట్‌లను, డెకర్ సొల్యూషన్‌లకు ఇది సరైన ప్రదేశం. అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతమైన సన్ సిటీలో ఉన్న మా స్టోర్ మా విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణిని అన్వేషించేందుకు స్థానికులకు స్వాగతించే వాతావరణాన్ని అందిస్తుంది. నైపుణ్యం కలిగిన మా సిబ్బంది వినియోగదారులకు పర్సనలైజ్ స్పేస్‌ను రూపొందించడంలో సహాయపడేందుకు అంకితభావంతో ఉన్నారు. వీరు వినియోగదారుల ఇళ్లను సౌకర్యంగా, సౌందర్యంతో కూడిన స్వర్గధామంగామార్చేందుకు సహకారాన్ని అందిస్తారు’’ అని పేర్కొన్నారు.
ఫ్రాంచైజీ స్టోర్ బిర్లా ఓపస్ ఓం హార్డ్‌వేర్ యజమాని బాబూలాల్ చౌదరి మాట్లాడుతూ, “ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి విడుదల అయ్యే ఏ బ్రాండ్‌కైనా నాణ్యత, నమ్మకం అనేవి పర్యాయపదాలు. అధిక-నాణ్యత గృహాలంకరణ పరిష్కారాల కోసం డిమాండ్‌ను గుర్తించి, బిర్లా ఓపస్‌తో భాగస్వామ్యం చేయడం సహజమైన ఎంపిక. వారి అత్యుత్తమ మరియు వినూత్న ఉత్పత్తులు, ప్రత్యేకించి పెయింట్ వృధాను తగ్గించే యాంటీ-స్పేటర్ టెక్నిక్‌కి అనుకూలమైనవి, అధిక కవరేజీ గ్యారెంటీ, పర్యావరణ స్పృహతో కూడిన అభ్యాసాలకు మా నిబద్ధతకు అనుగుణంగా ఉంటాయి. ఈ భాగస్వామ్యం అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం మాకుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ స్టోర్లు ఇప్పుడు వ్యాపారులు, వినియోగదారులకు సోమవారం నుండి శనివారం వరకు తెరిచి ఉంటాయి. ఆదివారాలు మినహా వారపు రోజులలో తమ ఆఫర్‌లను అన్వేషించేందుకు వారిని స్వాగతం పలుకుతోంది.
స్టోర్ వివరాలు:
1. స్టోర్ 1 – శ్రీ భాగ్యలక్ష్మి పెయింట్స్ &హార్డ్‌వేర్, సన్ సిటీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పక్కన, బండ్లగూడ జాగీర్, హైదరాబాద్, తెలంగాణ, 500086
2. స్టోర్ 2 – ఓం హార్డ్‌వేర్, రసూల్‌పురా, హైదరాబాద్, తెలంగాణ 500003
హైదరాబాద్‌లోని కొత్త బిర్లా ఓపస్ ఫ్రాంచైజ్ స్టోర్‌లు సముదాయానికి మూలస్తంభంగా మారడానికి సిద్ధంగా ఉన్నాయి. స్థానికులకు అత్యుత్తమ నాణ్యమైన పెయింట్‌లు, డెకర్ సొల్యూషన్‌లకు అసమానమైన అందుబాటును అందిస్తోంది. నాణ్యత, ఆవిష్కరణ మరియు వినియోగదారుని సంతృప్తిపై దృష్టి సారించి, బిర్లా ఓపస్ ఈ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఉంది. తన వినియోగదారుల నివాసాలను, జీవితాలను సుసంపన్నం చేసేందుకు వేచి చూస్తోంది. నేడే కొత్త స్టోర్‌లను సందర్శించి, బిర్లా ఓపస్ అందించే ప్రత్యేకతలను మీరు ఆస్వాదించండి!