హైదరాబాద్ లో బిలిటి ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ప్లాంట్

కాలిఫోర్నియా కేంద్రంగా పని చేసే బిలిటిఎలక్ట్రిక్ కంపెనీ హైదరాబాద్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ సమక్షంలో ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది. రూ.400 కోట్ల పెట్టుబడితో నెలకు 2,000 ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ తయారు చేసేలా ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్) సమీపంలోని వెలిమెల గ్రామ సమీపంలో 13 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్ ద్వారా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్‌తో పాటు ఈ ప్లాంట్‌లో అధునాతన లిథియం అయాన్ బ్యాటరీలను కంపెనీ తయారు చేయనుంది.