తెలంగాణలో మరో కీలక పరిశ్రమ … ప్రపంచంలోనే అతిపెద్దది
పెట్టుబడుల ఆకర్షణలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక పరిశ్రమ వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి భారీ వాహనాల తయారీ సంస్థ బిలిటీ ఎలక్ట్రిక్స్ త్రిచక్ర వాహనాల తయారీ ప్లాంట్ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బిలిటీ ఎలక్ట్రిక్ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో వాహనాలను తయారు చేస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే పలు దేశాల్లో ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. అమెజాన్, ఐకియా, జొమాటో, ప్లిప్కార్డ్ వంటి సంస్థలకు తమ వాహనాలను విక్రయిస్తోంది. ఈ సంస్థ తాజాగా తెలంగాణలో తన త్రిచక్ర వాహనాల ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.






