Bhatti Vikramarka:మహాలక్ష్మి పథకంతో .. లాభాల్లోకి : భట్టి విక్రమార్క

తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి (Mahalaxmi) పథకం తెచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఆర్టీసీ బస్సు (RTC bus) లో మహిళలకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా ఎంజీబీఎస్ (MGBS) లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా నేడు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందన్నారు. 200 కోట్ల ప్రయాణాలతో రూ.6 వేల కోట్లు ఆర్జించిందన్నారు. కాంగ్రెస్ (Congress) హయాంలో ఆర్టీసీ బలోపేతం అవుతోందని పేర్కొన్నారు.ఆక్యుపెన్సీ రేటు ఒకప్పుడు 67 శాతం ఉంటే ఈరోజు 97 శాతానికి వచ్చిందన్నారు. ఆర్టీసీ ఇటీవల వేల సంఖ్యలో కొత్త బస్సులు కొన్నట్లు తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఖర్చుకు వెనకాడకుండా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు.