Bandi Sanjay: హైదరాబాద్‌లో త్వరలో జరగబోయే సమావేశానికి.. ఇద్దరూ కలిసే ప్లాన్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పై చెన్నైలో జరిగిన సమావేశానికి కేటీఆర్ (KTR), రేవంత్ రెడ్డి (Revanth Reddy ) కలిసే వెళ్లారు. హైదరాబాద్ (Hyderabad)లో త్వరలో జరగబోయే సమావేశానికీ ఇద్దరూ కలిసే ప్లాన్ చేస్తున్నారు. ఆ ఇద్దరూ కలిసే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎంపీలతో ఓటు వేయించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇద్దరూ కలిసే మజ్లిస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధమయ్యారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్‌ను కాపాడేందుకు కేటీఆర్ బీఆర్‌ఎస్ (BRS) అభ్యర్థిని బరిలోకి దించలేదు. తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పినా కేటీఆర్ బుద్ధి మారలేదు. కేటీఆర్, రేవంత్ ఏకమై బీజేపీని దెబ్బతీసేందుకు మళ్లీ కుట్రలు చేస్తున్నారు. హెచ్‌సీయూ (HCU) భూములపై సీబీఐ విచారణకు సిద్ధమా? భూదందా, అవినీతిపరులపై ఉక్కుపాదం మోపే మోదీ సర్కార్ కేంద్రంలో ఉంది అని పేర్కొన్నారు.