Banakacharla: తెలంగాణ సమ్మతి లేకుండా ఇంట్రా లింకులు : రాహుల్ బొజ్జా
గోదావరి – కావేరి నదుల అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ (NWDA) ఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదింపుల భేటీ ముగిసింది. మరోమారు సమావేశం నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ (CWC) చైర్మన్ అతుల్ జైన్ (Atul Jain) వెల్లడిరచారు. నదుల అనుసంధానంపై రాష్ట్ర అభిప్రాయాలు వివరించినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా (Rahul Bojja) పేర్కొన్నారు. తెలంగాణ నుంచి వెళ్తున్న నీటిలో సగం అంటే, 74 టీఎంసీలు కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నాలుగు ఇంట్రా లింక్‌లను ప్రతిపాదించింది. తెలంగాణ సమ్మతి లేకుండా ఇంట్రా లింకులు ఆమోదించవద్దని కోరాం. బనకచర్ల లింక్ అంశం అంతగా చర్చకు రాలేదు. ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర అభిప్రాయాలను గతంలోనే చెప్పాం అని రాహుల్ తెలిపారు.







