వి హబ్ తో ఆస్ట్రేలియా ఒప్పందం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ లోని వి హబ్‌తో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఓమ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ విషయం ప్రకటించారు. ఈ భాగస్వామ్య ఒప్పందం ద్వారా మహిళలు, అణగారిన వర్గాలు, ఎల్‌జీబీటీ వర్గాల కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వి హబ్ లో వ్యాపార నైపుణ్యాల్లో స్టార్ట్ ఎక్స్ పేరుతో 13 వారాల ప్రీ ఇంక్యుబేషన్ కోర్సు అందిస్తారు. వి హబ్‌తో ఒక విదేశీ ప్రభుత్వం ఈ తరహా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారని ఆస్ట్రేలియా హై కమిషనర్ తెలిపారు.