కాంగ్రెస్ ఎంపీ అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ బయట పడిన ప్రతిసారి వాళ్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలి. రాజ్ పాకాల, విజయ్ మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్‌కు సిగ్గు ఉండాలి. గత ప్రభుత్వం డ్రగ్స్ కేసుని ఏ విధంగా దారి మళ్లించిందో ప్రజలకు తెలుసు. జన్వాడ పామ్ హౌస్ అంటేనే వివాదాలకు కేంద్రం. ఒకసారి దీపావళి ఫెస్టివల్, ఇంకోసారి గృహ ప్రవేశం అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తుంటే, వాళ్లు డ్రగ్స్‌ను ప్రేరేపించాలని చూస్తున్నారు అని మండిపడ్డారు.