యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహాంద్రా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆనంద్ మహీంద్రా ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొంది. రాష్ట్ర యువతకు నైపుణ్యాలు నేర్పించేలా రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్లలోని బేగరికంచెలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.