‘తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ’ ఛైర్మన్ గా ఆనంద్ మహీంద్రా

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఛైర్మన్ గా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆనంద్ మహీంద్రా ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ వర్సిటీ ద్వారా 17 రకాల కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పించనున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.