Bhatti Vikramarka:కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాకే ఎనర్జీ పాలసీ : భట్టి విక్రమార్క

ఉద్యోగ అవకాశాల ద్వారా పేదరికాన్ని జయించవచ్చని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడు విద్య ద్వారా సామాజిక, ఆర్థిక వెనుకబాటును జయించవచ్చన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ (Young India Residential School) , సీఎస్‌ఆర్ నిధులతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనిలో 2,600 మంది విద్యార్థులు (Students) చదువుకునేలా వసతులు కల్పిస్తున్నామన్నారు. సీఎస్‌ఆర్ (CSR) నిధులతో ప్రతి మండలానికి అంబులెన్స్ (Ambulance) ఏర్పాటు చేస్తాం. గురుకులాల విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికలతో వెళ్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం. రెప్పపాటు కూడా విద్యుత్ పోకుండా చర్యలు చేపడుతున్నాం. కన్వెన్షన్, నాన్‌కన్వెన్షన్ ఎనర్జీ అందించే దిశగా చర్యలు చేపడుతున్నాం. దేశంలో అత్యధిక గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా నిలుస్తున్నాం. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. 51 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని తెలిపారు.