హైదరాబాద్ లో అమెజాన్ భారీ పెట్టుబడి
అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్‌లో అగ్రగామి అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ఏసియా పసిఫిక్ రీజియన్ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. రాబోయే ఎనిమిదేళ్లలో 44 బిలియన్ డాలర్ల (సుమారు 36,300 కోట్ల) పెట్టుబడులను ఏడబ్ల్యూఎస్ ద్వారా కంపెనీ ప్రకటించింది. ఈ పెట్టుబడులతో ఏడాదికి 48 వేల పుల్టైం ఉద్యోగాలు లభించనున్నాయని కంపెని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ పెట్టుబడులు 2030 నాటికి సుమారుగా 7.6 బిలియన్డాలర్ల మేర భారతదేశ స్థూలా జాతీయోత్పత్తి (జీడీపీ)కి తోడ్పాటునందిస్తాయని భావిస్తున్నారు.






