Adi Srinivas: చెన్నమనేని రమేశ్‌పై డీజీపీకి ఆది శ్రీనివాస్ ఫిర్యాదు

మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (Chennamaneni Ramesh )పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Adi Srinivas) డీజీపీకి ఫిర్యాదు చేశారు. భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. చెన్నమనేనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ (DGP)ని కోరారు. ఇప్పటికే చెన్నమనేనిపై సీడీఐ అధికారులు(CDI officials) ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. కేసు వివరాలు అందించడానికి తమ కార్యాలయానికి రావాలని ఆది శ్రీనివాస్‌ను పిలిచారు.