Adi Srinivas: ఆ అవసరం మా సీఎంకు లేదు : ఆది శ్రీనివాస్

ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, ఆ అవసరం తమ నాయకుడు, సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) అన్నారు. రేవంత్ సమర్ధుడని తెలిపారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ మాది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం. మా మంచి పాలనను ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష పాత్ర కూడా కేసీఆర్(KCR)సరిగా నిర్వహించలేకపోతున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుంది. ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతూ విమర్శించడం సరికాదు. మీలా ట్యాపింగ్‌తో రాజకీయాలు చేయాల్సిన అవసరం మా ముఖ్యమంత్రికి లేదు. మాకు మా నాయకుల మీద నమ్మకం, విశ్వాసం ఉంది. గత ప్రభుత్వంలో భార్యభర్తలు, సినీతారలు (Movie stars) , జడ్జిలు (Judges) మాట్లాడిన కాల్స్ ట్యాప్ చేశారు అని అన్నారు.