Aadi Srinivas: కేటీఆర్‌వి థర్డ్ క్లాస్ బుద్ధులు.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

బిఆర్‌ఎస్ నాయకులపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌వి ‘థర్డ్ క్లాస్ బుద్ధులు’ అని, ఆ తరహా ఆలోచనలు చేయడం వల్లనే ప్రజలు వారిని ఓడించారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన.. ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై ఇండియా (INDIA Bloc) కూటమి రాజకీయ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతంలో కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేశారని ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై కేసీఆర్ (KCR), హరీశ్ రావు (Harish Rao) హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ఆయన ప్రశ్నించారు. నివేదికను అసెంబ్లీలో పెట్టకముందే కోర్టుకు వెళ్లడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని నిలదీశారు. కాళేశ్వరం కమిషన్‌ను చూసి కేసీఆర్, హరీశ్ రావు భయపడుతున్నారని ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) అన్నారు. కోర్టును ఆశ్రయించడం ద్వారా తాము తప్పు చేశామని వారే అంగీకరించినట్లయిందని విమర్శించారు. దాదాపు ఆరు నెలల పాటు అనేక మందిని విచారించిన తర్వాతే కమిషన్ నివేదిక ఇచ్చిందని, ఇంజినీర్ల సలహాలను కాదని కేసీఆర్ (KCR) సొంత నిర్ణయాలు తీసుకున్నారని కమిషన్ తేల్చిందని ఆయన (Aadi Srinivas) వివరించారు. ఈ నివేదికతో వాళ్ళ పాపాలు బయటపడతాయని భయపడి కోర్టుకు వెళ్లారని విమర్శించారు.