Revanth Reddy: ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్ స్టేట్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సమావేశం

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్ (Queensland) స్టేట్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న సానుకూల వాతావరణం, పెట్టుబడులకు కల్పించిన అనుకూల పరిస్థితుల గురించి వారికి వివరించారు.
తెలంగాణలో పరిశ్రమలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ట్రేడింగ్, ఇతర రంగాల్లో పెట్టుబడులు, అవగాహనా ఒప్పందాల విషయంలో సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు క్వీన్స్ ల్యాండ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
ఈ చర్చల్లో క్వీన్స్‌లాండ్ గవర్నర్ డాక్టర్ జెన్నెట్ యంగ్ (Dr Jeannette Young) గారు, క్వీన్స్‌ల్యాండ్ ఆర్ధిక, వాణిజ్య, ఉపాధి, శిక్షణా శాఖ మంత్రి రోస్లిన్ బేట్స్ (Rosslyn bates) గారితో పాటు ఇతర ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.