Formula E Race Case: ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం

ఫార్ములా ఈ -రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదుదారుడు, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ (Danakishore) వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. దీని ఆధారంగా బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్(KTR), పురపాలకశాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ (Arvind Kumar) కు నోటీసులిచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఏసీబీ సిద్ధమవుతోంది.
ఫార్ములా ఈ- రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీసంస్థకు సొమ్ము చెల్లించారంటూ దానకిశోర్ ఏసీబీ (ACB)కి ఈ ఏడాది అక్టోబరు 18న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పురపాలకశాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ ప్రధాన నిందితుడి (ఏ1)గా పేర్కొంటూ తెలంగాణ ఏసీబీ ఇటీవల కేసు నమోదు చేసింది. పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ (ఏ2), హెచ్‌ఎండీఏ అప్పటి చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డి (ఏ3)లనూ ఎఫ్‌ఔఐఆర్‌లో చేర్చింది.