హైదరాబాద్ చేరుకున్న ప్రవాసీయులు
వందే భారత్ మిషన్లో భాగంగా ప్రవాసీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. అబుధాబి నుంచి 170 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా 1920 విమానం సోమవారం రాత్రి 8:50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంది. అలాగే, అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన 118 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా 1617 విమానం ముంబయి మీదుగా సోమవారం ఉదయం 9.22 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. ప్రయాణికులను తనిఖీ చేయడంతో పాటు వారికి కొవిడ్ 19 పరీక్షలు, థర్మల్ స్కానింగ్ చేశారు. ప్రయాణికుల పత్రాల పరిశీలన పూర్తి చేసిన తర్వాత పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీస్టీ బస్సుల్లో నగరంలోని వివిధ హోటళ్లకు పంపించారు. ఈ ఏర్పాట్లను శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి పర్యవేక్షించారు.






