TCS : టీసీఎస్ వస్తే మరెన్నో ఐటీ కంపెనీలు.. విశాఖకు : ఎంపీ భరత్

విశాఖ అభివృద్ధి చెందడం, యువతకు ఉద్యోగాలు రావడం వైసీపీకి ఇష్టం లేదని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీసీఎస్ ఎక్కడికో వెళ్తుంటే భూములిచ్చి విశాఖలో పెట్టిస్తున్నామన్నారు. టీసీఎస్ వస్తే మరెన్నో ఐటీ కంపెనీలు విశాఖకు వస్తాయని చెప్పారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఈసారి డిపాజిట్లు కూడా రావన్నారు.