Tirupati: తిరుపతిలో మహిళా సాధికారిక కమిటీ సమావేశం
తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా సాధికారిక కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) , ఉప సభాపతి రఘురామకృష్ణరాజు (Raghuramakrishna Raju) తెలిపారు. సమావేశాల నిర్వహణపై సన్నాహక సమావేశం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మీడియాతో మాట్లాడారు. ఒక్కో రాష్ట్రం నుంచి ఏడుగురు కమిటీ సభ్యులు హాజరవుతాయరని తెలిపారు. మహిళా సమస్యలపై చర్చలు ఉంటాయని తెలిపారు. మహిళా సాధికారతకు సీఎం చంద్రబాబు (Chandrababu) పెద్దపీట వేశారని, తిరుపతి జిల్లా (Tirupati District) ప్రాశస్త్యం అందరికీ తెలిసేలా సమావేశాలు నిర్వహిస్తామన్నారు.







