Data Center: విశాఖలో రూ.15 వేల కోట్లతో…మరో డేటా సెంటర్
విశాఖపట్నంలో రూ.15 వేల కోట్లతో 300 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన హైపర్స్కేట్ డేటా సెంటర్(Data Center) ఏర్పాటుకు న్యూయార్క్ (New York) కేంద్రంగా పనిచేస్తున్న టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ఢల్లీిలోని అమెరికా-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదికపై రాష్ట్ర మంత్రి లోకేశ్ (Minister Lokesh), జేసీ-2 వెంచర్స్ వ్యవస్థాపకులు, సీఈఓ, యూఎస్ ఐఎస్పీఎఫ్ చైర్మన్ జాన్ ఛాంబర్స్, అడోబి సిస్టమ్స్ సీఈఓ, చైర్మన్ శంతను నారాయణ్ (Shantanu Narayan), గూగుల్ చీఫ్ టెక్నాలజిస్ట్ ప్రభాకర్ రాఘవన్, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్, టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ సహ అధ్యక్షుడు సచిత్ అహుజాల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థలు పరస్పర అవగామన ఒప్పందం కుదుర్చుకున్నాయి. 40 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు ద్వారా 2026 నాటికి ప్రత్యక్షంగా 200-300, పరోక్షంగా 800-1,000 ఉద్యోగాలు లభిస్తాయి. ప్రణాళిక, డిజైన్, డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు అవసరమైన ముఖ్యమైన ఎక్విప్మెంట్ను తీసుకొస్తుంది. నిబంధనలు అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు భూకేటాయింపులు, ప్రోత్సాహకాలు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తుంది.







