Bharat Forge: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ ఫోర్జ్ ఆసక్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్డ్ ఉత్పత్తుల తయారీలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ ఫోర్జ్ (Bharat Forge) వైస్ చైర్మన్ అమిత్ కల్యాణి (Amit Kalyani) ఆసక్తి వ్యక్తం చేశారు. విశాఖలోని నోవోటెల్లో హెటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తమ సంస్థ తరపున పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. పర్యాటక రంగంలో గండికోట వద్ద రివర్ క్రూజ్ ప్రాజెక్టును చేపట్టేందుకు సైతం ఆసక్తి వ్యక్తం చేశారు. తిరుపతి (Tirupati) సమీపంలో అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ సెన్సర్ల ఉత్పత్తిని చేపట్టాలని భావిస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలను సీఎం చంద్రబాబు ఫోర్జ్ వైస్ చైర్మన్కు వివరించారు. అనంతం అమిత్ కల్యాణిని శాలువాతో సత్కరించి అరకు కాఫీ గిఫ్ట్ప్యాక్ను సీఎం అందజేశారు. భారత్ ఫోర్జ్ చేపట్టే ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు.







